ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్ర రాజధానిలో కలల ఆకృతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:11 AM

  చరిత్ర సృష్టించనున్న నగర నిర్మాణం 13 జిల్లాల సంస్కృతిని ప్రతిబింబించేలా పరిపాలనా భవనాల నిర్మాణం  దేవాలయాల నుంచి వాస్తు సూత్రాలు పల్లె పట్టుల నుంచి రచ్చబండ కూడళ్లు..  ఆవ్గుస్టర్‌డ్యావ్గు తరహాలో జల రవాణా  ప్రణాళికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రదర్శన 


అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిపాలన నగరానికి రూపొందించిన హరిత, నీలి నగర ఆకృతులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కృష్ణా నది తీరాన అమరావతి పరిపాలన నగరానికి లండన్‌కు చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ నమూనాలను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు సమర్పించిన విషయం తెలిసిందే. దాదాను 51శాతం పచ్చదనంతో, జలప్రవాహం ఉండే విధంగా పరిపాలన నగరాన్ని నిర్మాణం చేయనున్నారు. రాజధానిలో 900 ఎకరాల్లో ఈ పరిపాలన నగరం ఉంటుంది. శాసనసభ, శాసన మండలి శాశ్వత భవనాలు, సచి వాలయం, ఇతర ప్రభుత్వ పాలన భవనాలు, సీఎం, గవర్నర్‌ నివాసం, రాజ భవన్‌, ఉన్నతాధికారులు నివాసాలు నిర్మించనున్నారు. ఈ పరిపాలన నగరం పూర్తిగా కాలుష్య రహితంగా నిర్మాణం కానుంది. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణా నది నుంచి ఒక కాలువను తవ్వి తిరిగి కృష్ణా నదిలోకి అను సంధానం చేయనున్నారు. దీని ద్వారా జల రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పరిపాలన నగరంలో ఎక్కడికైనా నడిచేంత దూరం మాత్రం ఉంటుందని చెబుతున్నారు. దీనికి ప్రత్యేంకగా వాకింగ్‌ ట్రాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. .


ఐకానిక్‌ బ్రిడ్జి అదుర్స్‌...


కృష్ణానదిపై రెండు వంతెనలు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మూడు రకాల ఆకృతులతో రూపొందించిన ఐకానిక్‌ వంతెన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. కూచిపూడి నృత్య భంగిమలో, పడ వ ఆకారంలో, స్వాగత తోరణాలతో రూపొందించిన ఈ ఆకృతులు అద్భు తంగా ఉన్నాయని ప్రశంసలు అందుతున్నాయి. వీటిలో ఒకటి ఖరారు చేయ నున్నారు. రెండు వరసల వంతెన ఉంటుంది. కింది వరసలో వాహనాలు పైవ రసలో పర్యాటకపరంగా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.


మరింత మెరుగ్గా ఉండాలి...


హరిత, నీలి నగరంగా రూపొందించిన ఆకృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మరింత మెరుగ్గా ఉండాలని చెబుతున్నారు. జనబాహుళ్యంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రత్యేకంగా యూట్యూబ్‌లోనూ, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లోనూ ఉన్నా యి. ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ రూపొందించిన ఆకృతులు హరిత, నీలి సమ్మి ళితంగా ఉన్నాయి. భవనాల ఆకృతుల్లో అంతగా స్పష్టత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనసభ, మండలి, సచివాలయం ఆకృతులు స్పష్టంగా కనిపించడంలేదు. భవనాల లోపలి వెపు ఆకర్షణీయంగా ఉన్నాయి. బయటి ప్రాంతాలు, లేఅవుట్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. పచ్చదనం నిండి ఉండ టంతో పర్యాటక ప్రాంతాలను గుర్తుకు తెస్తున్నాయని చెబుతున్నారు. అయితే భవనాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని భావించారు. అలాంటి ఆనవాలు ఎక్కడా కనిపించలేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ లేఅవుట్‌ను సీఎంతో పాటు మంత్రులు పరిశీ లించారు. సంతృప్తి మాత్రం వ్యక్తం చేయలేదని తెలిసింది. విడివిడిగా ఆకృ తులు సమర్పిస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్థూలంగా లేఅవుట్‌ వరకు ఆమోదం వచ్చే అవకాశం ఉంది. అమరావతి పరిపాలన నగరానికి సంబంధించిన నమూనాలను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనిపై అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. నమూనాలు నచ్చితే వాటికి ఆమోదం తెలపడంతో పాటు 500 పదాలతో అభిప్రాయం తెలిపే విధ ంగా అవకాశం కల్పించారు.


వారసత్వ సంపదకు పెద్దపీట...


రాజధాని అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరం స్థూల ప్రా థమిక ప్రణాళికలో రాష్ట్రంలోని 13 జిల్లాల చరిత్ర, సంస్కతి, వారసత్వ సంప దకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ పెద్దపీట వేసింది. భారతీయ వాస్తు సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చింది. మన పల్లెపట్టుల్లోని రచ్చబండ తరహాలో పీపుల్స్‌ స్కే్వర్‌ పేరుతో ఆధునిక నగరం అమరావతిలోకి తీసుకువచ్చింది. విభిన్న వృక్ష జాతులు, మొక్కల పరిక్షణకు వీలుగా జీవ వైవిధ్య పార్కుని, తెలుగు వారి చరిత్ర, సంస్కృతికి అద్దంపట్టేలా మ్యూజియంని ప్రతిపాదించింది. ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ప్రణాళికను శనివారం శాసనసభ కమిటీ హాల్‌లో శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌రావు హాజరయ్యారు. సభ్యులు మంచి సూచనలు, సలహాలు ఇస్తే ప్రణాళికలో పొందుపరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.


ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఇవీ...


పరిపాలనా నగరంలోని మొదటి బ్లాక్‌ని హిందూ దేవాలయం స్ఫూర్తితో డిజైన్‌ చేశారు. దేవాలయ ప్రాంగణానికి నాలుగు గోపురాలున్నట్టే దీనికి నాలుగు ప్రవే శ మార్గాలుంటాయి. నైరుతిలో సచివాలయం, ఆగ్నేయంలో విభాగాధిపతుల కార్యాలయ భవనం, వాటి మధ్యలో శాసనసభ భవనం ఉంటుంది. దేవాలయంలో కోనేరు, దాని మధ్యలో మండపం ఉన్నట్టే శాసనసభ భవనానికి ఎదురుగా జలాశయం దాని మధ్యలో మ్యూజియం, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తారు. పరిపాల నగరం తూర్పు, పడమర భాగాల్లో నిర్మాణాలు వస్తాయి. మధ్యలో సెంట్రల్‌ సై ్పన్‌, హరిత వనాలు, జలమార్గాలు ఉంటాయి. వీటిలో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వీలుంటుంది. వీటిని 13 జిల్లాల చరిత్ర, సంస్కృతికి దర్పణంగా తీర్చిదిద్దుతారు. ఉత్తర భాగంలోని నదీతీర ప్రాంతాన్ని ప్రజలకు వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దుతారు. అక్కడ విశాలమైన జీవ వెవిధ్య పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించారు. నగరం మధ్యలో ఉండే సెంట్రల్‌ సై ్పన్‌ నాలుగు వరుసలుగా ఉంటుంది. దీనిపైకి కార్లు వంటివి అనుమతించరు. భవిష్యత్తులో దీనిపై డ్రెవర్‌ రహిత వాహనాల్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉంది. ఎస్‌1, ఎస్‌2 బ్లాకుల్లో 80 శాతం వరకు ప్రభుత్వ భవనాలే ఉంటాయి. మిగతా రెండు బ్లాకుల్లో బహుళ ప్రయోజనకర భవనాలు నిర్మిస్తారు. వాటిలో బహుళ దుకాణ సముదాయాలు, వినోద కేంద్రాలు, నివాస ప్రాంతాలు, సర్వీసు అపార్‌‌టమెంట్లు వంటివి వస్తాయి. గవర్నర్‌, ముఖ్యమంత్రి నివాస భవనాల్ని మొదట ప్రతిపాదించినట్టు నదీ తీరానికి దగ్గర్లో కాకుండా, మొదటి బ్లాక్‌ (ఎస్‌1)లోనే నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ, వాషింగ్టన్‌, లండన్‌ వంటి నగరాల ప్రణాళికల్ని అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ లక్షణాలతో అమరావతి పరిపాలన నగర ప్రణాళికను సిద్ధం చేశారు. నడకదారులు, సైకిల్‌ ట్రాక్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 10 శాతం భూభాగంలో జలాశయాలు, కాలువలు ఉంటాయి. వాటిలో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ తరహాలో జల రవాణా ఏర్పాటు చేస్తారు. వాటర్‌ ట్యాక్సీలు, చిన్న బోట్లు నడుపుతారు. లండన్‌లోని ట్రఫాల్గర్‌స్కే్వర్‌ తరహాలో 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు ఉన్న సిటీ స్కే్వర్‌లు ఏర్పాటు చేస్తారు. పలు చిన్న స్కే్వర్‌లు కూడా ప్రతిపాదించారు. కొన్ని ఇళ్ల మధ్యలో రచ్చబండల తరహాలో చిన్న చిన్న స్కే్వర్‌లను ఏర్పాటు చేస్తారు. పరిపాలన నగరంలో ప్రధాన రహదారుల వెడల్పు 24 మీటర్లు ఉంటుంది. 15-16 మీటర్లు, 9, 7 మీటర్ల సన్నటి మార్గాలు ఉంటాయి. వీటిలో వాహ నాల్ని అనుమతించరు. మధ్యలో చెట్లు ఉంటాయి. ప్రజలు నడుస్తూ వెళ్లేం దుకు, షాపింగ్‌కి ఇక్కడ అవకాశం ఉంటుంది. 14 శాతం ప్రాంతాన్ని రహదా రులకు కేటాయించారు. ప్రధాన రహదారుల మధ్యలో కార్లు, వాటికి అటూ ఇటూ బస్సులు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సైకిల్‌ ట్రాక్‌లు, వాటి పక్క న నడకదారులు ఉంటాయి. నివాస ప్రాంతాల నుంచి 50 మీటర్ల నడక దూర ంలో ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది. పరిపాలన నగరంలో దక్షిణ భాగం నుం చి ఉత్తర భాగానికి వెళ్లేకొద్దీ భవనాల ఎత్తు పెరుగుతుంది. నదికి సమీపంలో ఐకానిక్‌ టవర్లు వస్తాయి. ఎస్‌1 బ్లాక్‌లోని శాసనసభ వంటి మకుటాయమాన భవనాలు ఎక్కడి నుంచెనా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరాన్ని ఆనుకుని ఒకపక్క రాయపూడి, మరోపక్క లింగాయపాలెం గ్రామాలున్నాయి. పరిపాలన నగర నిర్మాణం 2017 జులై, ఆగస్టుల్లో ప్రారంభిస్తారు. 2018 డిసెంబరుకి మొదటి దశ  పూర్తి చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com