ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రోపాలిత ప్రాంతంగా బెజవాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:24 AM

  ఇక విశాల విజయవాడ   మెట్రో నగరంగా గుర్తింపు  ప్రాజెక్టు కోసం 19 పంచాయతీల విలీనం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు


అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా గుర్తిస్తూ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మెట్రో రైలు ప్రాజెక్టు రావాలంటే ఆ నగరానికి మెట్రో హోదా తప్పనిసరి. ఈ దృష్ట్యా నగరపాలక సంస్థ పాలక మండలి విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్ని కలుపుతూ మెట్రో నగరంగా మారుస్తూ గతంలోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి కొనసాగింపుగా ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాంతాన్ని  మెట్రోపాలిటన్‌ గా గుర్తిస్తూ 104జీవో జారీచేసింది. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా త్వరలో విజయవాడను మెట్రోపాలిటన్‌ గా నోటిఫై చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తాజా ఉత్తర్వులతో మెట్రో రైలు పనులకు మార్గం సుగమం అయిందని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. నవ్యాంధ్ర ప్రజలకు ఎట్టకేలకు నిరీక్షణ ఫలిం చింది. రాష్ట్ర పాలనా కేంద్రం విజయవాడ ఇక మహానగరంగా గుర్తింపు పొంద నుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖ నగరాలతో పాటు విజయవాడ కూడా ఈ హోదా దక్కించుకుంది. బెజవాడను మెట్రోపాలిటిన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెంబరు 104) విడుదల చేసింది. విజయవాడ శివారులో మొత్తం 19 పంచాయతీలను మెట్రోపాలిటిన్‌ ప్రాంతాలుగా గుర్తిస్తూ జీవో జారీ చేసింది. త్వరలో విజయవాడ నగరంలో వీటిని విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం విజయవాడ నగరం పరిధి 61.9 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2011 జనాభా ప్రకారం 10.39లక్షలు ఉన్నా రు. ప్రస్తుతం మరో 5లక్షలు పెరిగి ఉంటారని అంచనా. విజయవాడ నగరానికి రెండేళ్ల క్రితం మెట్రో ప్రాజెక్టు మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొర వతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తితో విజయవాడ నగరా నికి మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం మెట్రో పాలి టిన్‌ ప్రాంతాల్లోనే ఈప్రాజెక్టు నిర్మాణం చేయాల్సి ఉంది. నవ్యాంధ్రలో మెట్రో ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, నవ్యాంద్ర రాజధాని అమరావతి ప్రాంతాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మొదటి దశలో విజయవాడ నగరానికి మంజూరు చేశారు. రూ.6వేల కోట్ల అంచనా వ్యయంతో రెండు కారి డార్లు నిర్మిస్తారు. నగరంలో ఏలూరు, బందరు రోడ్డులో రెండు కారిడార్లను నిర్మాణం చేయనున్నారు. 60శాతం నిధులను విదేశీ రుణంగా తీసుకో నున్నారు. దీనికి మొదట జైకా అంగీకరించినా వివిధ షరతుల కారణంగా దాన్ని వదులుకున్నారు. దీంతో జర్మనీ, ఫ్రాన్సు దేశాలకు చెందిన సంస్థలతో ఒప్పందం కుదిరింది. మరో రెండు నెలల్లో రుణం అందనుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ప్రధాన సలహాదారుగా డీఎంఆర్‌సీ వ్యవహరిస్తోంది. కారి డార్ల సివిల్‌ పనులకు టెండర్లను పిలిచారు. త్వరలో తెరవనున్నారు. అయితే పీఐబీ అనుమతి రావాల్సి ఉంది. దీనికి మెట్రో పాలిటిన్‌ ప్రాంతాలుగా గుర్తింపు ఉండాలి. బందరు రోడ్డు కారిడార్‌ పెనమలూరు వరకు ప్రస్తుతం నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం ఆటోనగర్‌ వరకు నగరం పరిధిలో ఉంది. ఈ రోడ్డులో యనమలకుదురు, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు పంచాయతీలను మెట్రో ప్రాంతాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రోడ్డులో రామవరప్పాడు కూడలి వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉంది. ఇప్పుడు రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు పంచాయతీలను మెట్రో ప్రాంతాలుగా గుర్తించారు. ప్రస్తుతం మొదటి దశలో నిడమానూరు వరకు కారిడార్‌ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో గన్నవరం వరకు విస్తరించనున్నారు. గన్నవరంలో విమానాశ్రయం కూడా ఉంది. దీంతో గూడవల్లి, డోన్‌ఆత్కూరు, కేసరపల్లి, బుద్దవరం, గన్నవరం పంచాయతీలను మహానగరంలో భాగంగా చేర్చనున్నారు. రెండో దశ మెట్రో విస్తరణలో గొల్ల పూడి, నున్న వైపు కారిడార్లు విస్తరించే అవకాశాలు ఉన్నా యి. గన్నవరంతో పాటు ఇటువైపు ఇబ్రహీంపట్నం వరకు నిర్మాణం చేయాలనేది ఆలోచనగా ఉంది. దీంతో ప్రస్తుతం గొల్లపూడి, జక్కంపూడి పంచాయతీలను మెట్రో ప్రాం తాలుగా గుర్తించారు. విజయవాడ నగరానికి వీటిపీఎస్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాంతాన్ని కలిపేవిధంగా నున్న, పాతపాడు, అంబాపురం పంచాయతీలను కూడా మెట్రో ప్రాంతాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 19 పంచాయతీలను గుర్తించడంతో నగర జనాభా దాదాపు 18లక్షలకు చేరుతుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు అడ్డంకి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ పంచాయతీల్లో మెట్రో కోసం గతంలో తీర్మానాలు చేశారు. తమకు మెట్రో అవసరం ఉంది కానీ తాము నగరపాలక సంస్థలో విలీనం కాబోమని స్పష్టం చేశారు. ఆతీర్మానాలు చెల్లకపోవడంతో మరోసారి మెట్రో ప్రాంతాలుగా గుర్తించేందుకు అభ్యంతరం లేదని తీర్మానం చేస్తూ ప్రతిపాదనలు పంపారు. జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో వీటిని పంపారు. ఈ ప్రాంతాలను మెట్రో ప్రాంతాలుగా గుర్తిం చాలని వీఎంసీ కమిషనరు 2015 ఏప్రిల్‌లో అమరావతి మెట్రో రైలు కార్పొ రేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి 2016 ఫిబ్రవరిలో, తిరిగి 2017 జనవరిలో నగరపాలక సంస్థ, ఏఎంఆర్‌సీలు లేఖలు పంపాయి. దీంతో ప్రభుత్వం నిశితంగా పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసింది.


ఇక విలీనం మాత్రమే...


విజయవాడ నగరంలో మొత్తం 29 పంచాయతీలను విలీనం చేయాలని ప్రతి పాదన ఉంది. కానీ ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టు పేరుతో 19 గ్రామాలను కలి పారు. వీటిని రాజ్యాంగం ప్రకారం మెట్రో ప్రాంతాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ 19 పంచాయతీల్లో నగర తరహా అభివృద్ధి జరుగుతోంది. బహుళ నివాసాలు వెలిశాయి. కానీ మౌలిక వసతులు మాత్రం లేవు. విజయవాడ ప్రస్తుతం కేవలం 61.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ పంచాయతీలను విలీనం చేస్తే దాదాపు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com