ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"గ్రే మాన్" లో ధనుష్ ఇంటెన్స్ రోల్. ఇదే .!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 12:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి నటిస్తున్న హాలీవుడ్ చిత్రం "ది గ్రే మాన్". అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ వంటి వరల్డ్ టాప్ క్లాస్ సినిమాలను తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రిస్ ఇవాన్స్, ర్యాన్ గోస్లింగ్, అనా డే ఆర్మాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ ఒక ఇంటెన్స్ రోల్ లో నటిస్తున్నారట. ఏదో నామ్ కే వాస్తే (నామమాత్రం) పాత్రలో కాకుండా, కథలో భాగంగా, కథను ముందుకు నడిపించే బలమైన పాత్రలో ధనుష్ ఈ సినిమాలో నటిస్తున్నాడని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అలానే ధనుష్ పై హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఈ సినిమాలో ఉన్నాయట. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, సినిమా విడుదలయ్యేంతవరకు ఆగాల్సిందే. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తమిళం భాషలలో జూలై 15 నుండి సెలెక్టెడ్ ధియేటర్స్ లో , జూలై 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com