ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్, ఇంటర్ అర్హతతో 237 ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 11, 2021, 04:12 PM

ఇతర వివరాలు: తమిళనాడు రాజధాని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ-NIOT ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 237 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారికి రూ.78,000 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.


దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 20


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటలు


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.


వయస్సు- 28 ఏళ్ల నుంచి 50 ఏళ్లు


ఎంపిక విధానం- ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ లేదా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ. ఇతర పోస్టులకు రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టెస్టులు ఉంటాయి.


వేతనం- రూ.18,000 నుంచి రూ.78,000


పూర్తి వివరాలను https://www.niot.res.in/niot1/recruitment.php లింక్‌లో తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com