ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారమే మనందరి సంకల్పం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 26, 2017, 01:41 AM

 ఒంగోలు, సూర్యప్రతినిధి: అధికారం మనందరి సంకల్పం కావాలి...జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేద్దాం... చంద్రబాబుకు కనుకగా ఇద్దాం...ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేద్దాం... వ్యక్తిగత కార్యక్రమాలకు తావు ఇవ్వొద్దు..సీఎం చంద్రబాబు పడుతున్న శ్రమను చూసి మనం కూడా ఆత్మ విమర్శ చేసుకుందామని రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. గుంటూరు రోడ్డు లోని ఏ1 కన్వేన్షన్‌ హాలులో గురువారం జరిగిన టీడీపీ మినీ మహానాడును పార్టీ జెండా, జ్యోతి ప్రజ్వలన చేసి నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో గత పదేళ్లుగా టీడీపీ కార్యకర్తలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా రన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో దోపిడీ రాజ్యం, చీకటి పాలన సాగిం దని దుయ్యబట్టారు. ప్రజా సంపదను దోచుకుతిన్నారని విమర్శిం చారు. ప్రజల సమస్యల పై ప్రజల పక్షాన పోరాడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టాలే మా అందరి కష్టాలుగా భావిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడకు వెళ్లినా ముందుగా కార్యకర్తల గురించి మాట్లాడతారని మంత్రి చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ ఎన్‌.టి. రామారావు స్పూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలతోనే ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, కార్యకర్తల త్యాగంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ముఖ్యమంత్రి చేస్తున్న కష్టంలో మనందరం పాలుపంచుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.  దామచర్ల జనార్ధన్‌ నాయకత్వంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  జిల్లాలో సమర్ధవంతమైన నాయకత్వం ఉంద ా్నరు. సమస్యలను సవాళ్లుగా తీసుకొని పని చేస్తున్న మహా వ్యక్తి చంద్రబాబు నాయుడని మంత్రి నారాయణ అన్నారు. ఆర్థిక నేరాలతో జైలుకు వెళ్లిన నాయ కులు ప్రభుత్వం పై విమర్శలు చేయడాన్ని ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై మాట్లాడలేని జగన్‌ కూడా ఒక నాయకు డిగా చెలామణి కావడం సిగ్గుచేటన్నారు. బంగారు రాష్ట్రంగా నిర్మించుకునేం దుకు సమిష్టిగా పని చేయాలని జిల్లా అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తా నని మంత్రి నారాయణ తెలిపారు. 


 రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్వేయంగా ముందు కెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిం చారని, చంద్రబాబు నాయుడు పరిపాలనాధక్షుడని, ఆయన నేతృత్వంలో రాష్ర్టం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి సంక్షే మం, ప్రజలు, రైతులను కాపాడుకొని, గిట్టుబాటు ధరలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం రూ. 17వేల కోట్ల ఆర్థిక లోటుతో ఉన్నా,  ఎన్నికల సమ యంలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రూ.24 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆరు వేల కోట్ల పెన్షన్లు ఇచ్చామని, రూ.10వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేశామ న్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు. ఐదు గ్రిడ్లు, ఏడు మిషన్ల, నీరు-చెట్టు కార్యక్రమం, పొలం పిలుస్తోంది వంటి కార్యక్ర మాలతో  కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ప్రభుత్వానికి ఆదా యం కూడా వస్తుందన్నారు. ముఖ్యమంత్రి సింగపూర్‌, మలేషియా, జపాన్‌ లలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరకు వస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు, ఆర్థికం గా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి అండగా ఉండాల్సిన ప్రతి పక్ష పార్టీలు విమర్శిం చడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు లను పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.  వెలుగొండను త్వరలోనే పూర్తిచేసి పశ్చిమ ప్రాంతానికి సాగు, త్రాగునీటిని అందించడం జరుగుతుం దన్నారు. దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పొగాకు, సుబాబుల్‌కు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  రాష్ట్ర శిశు, సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం శనవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న ఫ్యాక్షన్‌ నాయకుడు జగన్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రిని అడ్డం పెట్టుకొని తన భర్తతో పాటు, 100 మందిని హత్యలు చేసిన చరిత్ర జగన్‌ది అన్నారు. నుదుటి మీద కుంకుమ బొట్టు పోయిన నాలాగా ఎవరిని చేయవద్దని జగన్‌ను కోరారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను పార్టీ శ్రేణులు తనిఖీలు చేసి సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. సమస్యలను చర్చించుకొని పరిష్కరించు కోవా లని పిలుపునిచ్చారు. 


 రాష్ట్ర పరిశీలికులు, మాజీ మంత్రి పుష్పరాజు మాట్లాడుతూ 2019 ఎన్నికలు లక్ష్యంగా మనందరం పని చేయాలన్నారు. జిల్లాలోని పార్టీలో నెలకొన్న సమస్య లను త్వరలోనే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. పార్టీలో అందరు కలిసి కట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాలు మనమే గెలుచుకుంటామన్నారు.   కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ మాట్లాడుతూ  జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే విధంగా కృషి చేస్తామని  ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు. అనేకమంది సీనియర్లు పదేళ్ల పాటు కష్టపడ్డారని, అటు వంటి వారు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల్లో సీనియర్లకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.  పార్టీలో నెలకొన్ని బేదాభిప్రాయాల పరిష్కరించుకొని, కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మినీ మహానాడులో బాపట్ల ఎంపి శ్రీరామ మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ జూపూడి ప్రభాకరరావు, ఒంగోలు డెయిరీ చైర్మెన్‌ చల్లా శ్రీనివాసరావు,  కొండెపి, ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, సంత నూతలపాడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జి బి.ఎన్‌.విజయకుమార్‌, కరణం వెంకటేష్‌,  తెలుగుయువత నాయకులు శ్రీధర్‌, మహిళా నాయకురాలు టి. అరుణ, దామచర్ల సత్య,  కొమ్మూరి రవిచంద్ర,  జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com