ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ‘చంద్ర’వరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 26, 2017, 01:44 AM

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రవరం అన్నారు డిప్యూటీ సి.ఎం కే.ఈ క్రిష్ణమూర్తి. ముఖ్యమంత్రి చంద్ర బాబు క్రుషితోనే పోలవరం ప్రాజెక్టు సాకారమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రభుత్వం చేపడుతున్ననీటి సంరక్షణా చర్యల వల్ల  రాయలసీమ త్వరలోనే మరో కోనసీమగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్య మంత్రి ప్రసంగించారు. కొత్తగా జిల్లా కలెక్టర్ల భాధ్యతలు చేపట్టిన వారందరికీ అభినంధనలు తెలియజేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి  యువతకు ప్రాధాన్యతను ఇచ్చారని,  ఇది ఎంతో శుభ పరిణామమన్నారు. రాజధాని నిర్మాణానికి తోలి అడుగులు పడ్డాయని మొత్తం 900 ఎకరాల్లో పరిపాలన నగరం రూపొందుతోందాన్నారు. నభూతొ న భవిష్యతి అన్న రీతిలో మన రాజధాని ప్రపంచ దేశాల రాజధానులకి మించి నిర్మాణమవుతుం దన్నా రు. ఏ రాష్ట్రానికైనా రాజధానే ఆయువుపట్టని, ఎంత విస్తృతంగా దీన్ని అభివృద్ధ్ది పరచగలిగితే అంతగా విదేశీపెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. ముఖ్య మంత్రి అమెరికా పర్యటన విజయవంతమయిందని, 15 నగరాలలో పర్యటించి, 90కి పైగా కంపెనీల ప్రముఖులను, ప్రతినిధులను సమావేశ మయ్యారు. రాష్ట్రానికి  విదేశీ పెట్టుబడులు ఆకర్షాంచడంలో విజయం సాధిం చారని, దీనికి ముఖ్యమంత్రి గారిని మనమంతా అభినందించాలన్నారు. కోస్టల్‌ కారిడార్‌, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో విమానాశ్రయ నిర్మాణం ద్వారా  రాష్ట్ర స్వరూపం మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రతీ జిల్లాలో లభ్యమయ్యే వనరులను ఆధారంగా పారిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను ఉచితంగా ఇవ్వడం,  ఛార్జీలు తగ్గించడం వల్ల ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటుకి ముం దుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ఉపయోగ కర మైన మూడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి  ఇళ్ళ నిర్మాణం చేసుకున్న  స్థలాల క్రమబద్దీకరణ మరియు మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు 10 సంవత్సరాల తరువాత విక్రయించు కునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసామన్నారు. ఈ సంస్కరణలను ఫలాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో జిల్లా కలెక్టర్లు సమర్ధవం తంగా వ్యవహరించాలన్నారు.మంత్రులగా ప్రతి నెలా రోజు వారి కార్యక్రమాల వివరాలు ముఖ్యమంత్రిగారి సమీక్ష కోసం పంపుతున్నట్లు వివరించారు. అధికారులు విధిగా తమ నెల వారీ రిపోర్టులను  రెవెన్యూ సెక్రట రీకి పంపా లన్నారు.  వారానికి ఒకసారి, తహసీల్దార్‌ ఆఫీస్‌  సర్వేయర్‌ పనితీరు  తనిఖీ చేయడం వల్ల ఆ శాఖల పనితీరు లో గణనీయమైన మార్పు వస్తుంద న్నారు. పంట సంజీవని, నీరు - చెట్టు, చెక్‌ డాంల నిర్మాణాల వల్ల  ఒక్క కర్నూలు జిల్లా లోనే భూగర్భ జలాలు ఎన్నడూ లేనంతగా 3.5 మీటర్ల  పెరిగా యని, ప్రభు త్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తాగునీరు, సాగునీరు కొరత తీరుతుం దన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా డెల్టా ప్రాంతానికి నీరందించి, మిగులు జలాలను  ద్వారా రాయలసీమకు సాగునీరు, తాగు నీరు ఇచ్చి రాళ్ళ సీమను రతనాల సీమగా మార్చడానికి అన్ని  చర్యలు తీసుకుంటు న్నామన్నారు. గత 35 నెలల కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టిన అనేక అభివృద్ధి  కార్యక్రమాలు కలెక్టర్ల సహకా రంతో కార్యరూపం దాలుస్తున్నా యన్నారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌ లను ఆయుధాలుగా మలుచుకుని రాష్టాన్ని ప్రగతిపధంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే, రాష్ట్ర అభివృద్ధ్దికి ప్రతిపక్షం అవాంతరాలు కల్పిస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని  ఆశిం చామని, ప్రతిపక్ష పార్టీ దిగజారుడు ధోరణివల్ల ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com