ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకని పరిస్థితిలో రాష్ట్రము ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 05:46 PM

‘పేకాట క్లబ్‌ల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదు’ అంటూ జనేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణప వరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలలో సోమవారం వారాహి విజయ యాత్ర సభలు ఆశేష జనవాహిని మధ్య జరిగాయి. గణపవరం సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను ఎండగట్టారు. ‘వాసు బాబు వద్దు.. వైసీపీ పాలన వద్దు’.. అంటూ సభికులతో అనిపించారు. ‘తన ఇంటిముందు రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే వాసుబాబు మనకేం చేస్తాడు. ఇది పేకాట ప్రభుత్వం. చుట్టూరా గోదావరి జలాలు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు దొర కని పరిస్థితి ఉంది. గోదావరి నది నుంచి గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పిస్తాం. గణపవరంలో జనసేనకు ఓటేస్తే అంతు చూస్తామనే వైసీపీ నాయకుల తాట తీస్తా. వైసీపీ గుండాల తాటాకు బెదిరింపులకు లొంగేది లేదు. ఏ స్వార్ధం లేకుండా ఉండే వాడే జనసైనికుడు. ఓటేస్తే వేళ్ళు తీసేస్తే.. వారి చేతులు తీస్తాం. వైపీపీ గుండాలను రోడ్లపై పరిగెత్తిస్తాం. మాకు భయం లేదు. ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. పెదనిండ్రకొలను భీమేశ్వరస్వామి ఆలయ భూముల లీజులు కట్టడం లేదని దేవుడి మాన్యాలు తినేవాడి తలలు తెగిపోతాయని చాణుక్యుడు చెప్పాడు.. జాగ్రత్తగా ఉండండి. వైఎస్‌ఆర్‌ హయాంలో కొట్టేసిన జిరాయితీ చెరువులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. కొల్లేరు లెక్కలు తేలిస్తే పదివేల ఎకరాలు మిగులుతాయి. వాటిని పేదలకు పంచవచ్చు. కలుషిత జలాలు అరికట్టి కొల్లేరు కు కాపాడుకుందాం. వైసీపీ హయాంలో వంతెనలు , కల్వర్డులు దెబ్బతిన్నాయి. గుండుగొలను, నారాయణ పురం, గణపవరం వంతె నలను పునర్‌నిర్మిస్తాం. ఊరూర మద్యం ఉందికానీ మంచినీరే ఇవ్వట్లేదు. నియోజవర్గంలో గల 81 గ్రామాల్లో 64 గ్రామాలకు స్వచ్చమైన తాగునీరు అంద ట్లేదు. పత్సమట్ల ధర్మరాజు తన ఫౌండేషన్‌ ద్వారా సొంత డబ్బు లతో తాగునీరు అందిస్తున్నారు. ఆక్వా ఫీడ్‌, సీడ్‌ ధరలు పెంచేసి సర్వనాశనం చేశారరు. 2015లో రొయ్య ఫీడ్‌ బస్తా రూ.1650 ఉంటే నేడు రూ.2700లకు పెంచి రైతులను నట్టేట ముంచేసింది ఈ ప్రభు త్వం. సబ్సిడీలు పోయాయి. ఆక్వా టాక్స్‌ను జగన్‌ దోచేస్తున్నాడు. పోలవరం కుడి కాల్వ గట్లను ఈ ఎమ్యెల్యే మనుషులు తవ్వుకుపోయి మట్టిని అమ్మేసుకుంటు న్నారు. ఈ నియోజక వర్గమంతా గజానికో గొయ్యిలతో రోడ్లు ఉన్నాయి. రోడ్డు వేయ లేని ఇంకా జగన్‌నే కావాలంటారా’.. అని స్ధానికు లను ప్రశ్నించగా వద్దు వద్దు అని సమాధానం చెప్పా రు. ఉంగుటూరు అసెంబ్లీ అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఆక్వా, వరి రైతులను మోసం చేసిందన్నా రు. ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి మోసం చేశాడని, కొల్లేరు గ్రామాలను తాగునీరు లేదు. ప్రజలకు సేవ చేయాలనే తలంపు రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు మనం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఎంపీ కూటామి అభ్యర్థి పుట్టా మహేష్‌ యాద వ్‌ మాట్లాడుతూ చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడన్నారు. ఏలూరు పార్ల మెంటరీ నియోజ వర్గ అభివృద్ధి బాధ్యత నాదని, తనకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఉంగుటూరు నియోజకర్గ సమన్వయ కర్త వట్టి పవన్‌ కుమార్‌, జిల్లా బీజేపీ కన్వీ నర్‌ శరణాల మాలతీరాణి, తోట శ్రీను, ఘంటా అన్నవరం, ఇందుకూరి రామకృష్ణంరాజు, కూసంపూడి సురేంద్ర, సరిపల్లె చిన్నా, వంగా రఘు, చింతలపాటి బాసిరాజు, వాసురాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com