బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి అరెస్టును ఖండిస్తున్నాను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి మీడియా తో మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆ ? ప్రశ్నిస్తే అరెస్టులా? నేను ఉన్నాను అంటే అభివృద్ధి చేయడానికి అనుకున్నాం.. గానీ అరాచకనికి అని అనుకోలేదు.నేను విన్నాను అంటే ప్రజావాణి వినడానికి అనుకున్నాం.. గాని విని పోలీసులతో అరెస్ట్లు చేయించడానికి అని అనుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వైసీపీ కి టీడీపీ కి పట్టిన గతే పడుతుంది. ఢిల్లీ లో వంగి వంగి మోదీ గారికి దండాలు పెట్టి ఇక్కడ క్యాడర్ ని హింసించి, మా నాయకుడిని అరెస్టు చేస్తూ మీ డబల్ స్టాండ్ బుద్ధి చూపించారు.చంద్రబాబుది యూ టర్న్.. వైసీపీది రివర్స్ టర్న్.రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడింది.