ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందడి మొదలైంది. కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆనంద్ పిరమల్‌తో డిసెంబరు 12 ఇషా అంబానీ వివాహం జరగనుంది. ఇందుకోసం ముకేశ్ అంబానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శుభలేఖలు తయారు చేయించారు. ఓ బాక్స్ రూపంలో ఉండే ఈ వెడ్డింగ్ కార్డు ఖరీదు అక్షరాలా మూడు లక్షల రూపాయలు. బాక్స్ పైన వధూవరుల ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ఐఎ’ అని రాయించారు. బాక్స్‌ను తెరిచిన వెంటనే అందమైన శుభలేఖ కనిపిస్తుంది. ఆ తర్వాత గాయత్రీ మంత్రం వినిపిస్తుంది. శుభలేఖ అన్ బాక్సింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి!