ప్రస్తుత కాలంలో తెల్ల జుట్టు అందరిని బాధిస్తున్న సమస్య. పెద్దా - చిన్నా, ఆడ - మగ అనే తేడా లేకుండా ఈ కాలంలో చాలామందికి తెల్ల జుట్టు వస్తుంది. వీటికి కారణాలు ఏవైనా కావొచ్చు.., కానీ ఒకసారి తెల్లజుట్టు వచ్చిన తర్వాత నల్లగా ఎలా మార్చుకోవాలనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. గబుక్కున ఏ ఫంక్షన్ కి వెళ్లలేని పరిస్థితి తెల్లజుట్టు వున్నవారిది. అలాంటి వారు ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు నల్లని నిగనిగలాడే జుట్టును అనతికాలంలోనే సొంతం చేసుకోవచ్చు.
సహజంగా జుట్టుకు హెన్నాను అప్లై చేస్తుంటాం. అయితే, హెన్నాలో కొన్ని పదార్థాలను కలిపి జుట్టుకు రాస్తే, రిజల్ట్ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇందుకోసం మీ దగ్గర టీ పొడి, కాఫి పొడి, ఉసిరికాయ పొడి ఉంటె చాలు.
ముందుగా ఒక గిన్నెలో స్పూన్ టీపొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడొక పాన్ ను తీసుకుని కొద్దిగా ఉసిరికాయ పొడిని వేసి బాగా వేయించుకోవాలి. ఈ రెండు బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్న డికాక్షన్, ఉసిరికాయపొడి, పెరుగు, కాఫీపొడి, హెన్నా వేసి ఉండలు లేకుండా మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. తల స్నానం చేసేముందు ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని తలస్నానం చేస్తే, నల్లని జుట్టు మీ సొంతం.