ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రణపాల మొక్క గొప్ప వరం

Health beauty |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 10:13 PM

రణపాల... మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరిగే అద్భుత ఔషధ మొక్క ఇది. ర‌ణ‌పాల మొక్క యొక్క ఆకులు,వేర్లు, కాండం ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడి సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట. ఆయుర్వేద ప‌రంగా ఈ మొక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక చిన్న ఆకును తుంపి మట్టిలో నాటినా రణపాల మొక్క వచ్చేస్తుంది. 


ర‌ణ‌పాల ఆకులు కిడ్నీల స‌మ‌స్య‌లు, కిడ్నీ లో రాళ్ళు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ రణపాల ఆకును ప్రతిరోజూ రెండుపూటలా  రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో,బ్లాడర్ లో ఎర్పడ్డరాళ్లు బయటకు వచ్చేస్తాయి. అంతేకాకుండా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను వదిలించుకోవడానికి కూడా రణపాల ఆకును ఉపయోగిస్తారు.  


ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం ద్వారా జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com