కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - సగం ముక్క, నిమ్మకాయ - 1, ఆరెంజ్ - 1, పుదీనా - కొన్ని ఆకులు, ఐస్ క్యూబ్స్ - కొన్ని, సెవెన్ అప్ - 1 బాటిల్.
తయారీవిధానం: పుచ్చకాయను గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కోసుకుని, జ్యూసర్ లో వేసి మెత్తని జ్యూస్ లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయను, ఆరెంజ్ ను, పుదీనా ఆకులను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసును తీసుకుని అందులో పుదీనా ఆకులను, రెండు మూడు నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత మిగిలిన నిమ్మకాయ ముక్కల రసాన్ని అందులో పిండుకోవాలి. అలానే ఆరెంజ్ ముక్కల రసాన్ని కూడా ఆ గ్లాసులో పిండుకోవాలి. తర్వాత ఆ గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి, ముప్పావు వంతు వరకు సెవెన్ అప్ డ్రింక్ తో నింపాలి. ఆ తర్వాత ఈ గ్లాసులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ ను యాడ్ చేసుకుంటే సరి. వాటర్ మెలన్ - ఆరెంజ్ మొజిటో రెడీ అయినట్టే.