ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ...

national |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 05:04 PM

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. 2018లో శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత రెహానా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హిందువులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులు పెను దుమారాన్ని రేపాయి. ఈ వివాదంలో ఆమెపై కేసు నమోదైంది. 18 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.


ఇప్పుడు తాజాగా.. తన అర్ధనగ్న శరీరంపై కుమార్తె, కుమారుడితో బాడీ పెయింట్ వేయించుకున్నారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి వివాదానికి కారణమైంది. ఆమెపై రెండు చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పదేళ్ల వయసున్న కుమారుడు, 12 ఏళ్ల వయసున్న కుమార్తెతో అర్ధనగ్నంగా పడుకుని శరీరంపై పెయింట్ వేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమెకు ఈ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సైబర్ సెల్ శాఖ ఈ కేసును విచారిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com