ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా సోకని దేశాలివే..

international |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 03:52 PM

కరోనా వైరస్(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచదేశాలని గడగడలాడిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ల ప్రజలకు ఈ వైరస్ సోకగా.. 60వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వూహన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్గంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు జర్మనీలపై ఎక్కువగా ఉంది. అయితే కోవిడ్-19 సృష్టించిన ఈ సంక్షోభాన్ని పక్కనపెట్టిన.. అసలు ఈ మహమ్మారి సోకని దేశాలు ప్రపంచంలో ఉన్నాయా.. అనే ప్రశ్న వస్తే.. అందుకు సమాధానం కూడా అవుననే వస్తుంది.


కొన్ని నివేదికల ప్రకారం.. పసిఫిక్‌ ద్వీపాల్లోని కొన్ని చిన్న దేశాల్లో ఇప్పటివరకూ కోవిడ్-19కు సంబంధించిన లక్షణాలు కనిపించలేదు. ఇతర ప్రపంచంతో ఆ దేశాలకు సంబంధాలు తక్కువగా ఉండటం.. ప్రయాణ నిబంధనల కారణంగా వీరికి ఈ లాభం చేకూరింది. సొలొమాన్ ద్వీపం, వనౌటు, సమోవా, కిరిబతి, మైక్రోనేసియా, టోంగా, మార్షల్ ఐలాండ్స్ పాలౌ, తువాలు, నవురు దేశాలలో ఇప్పటివరకూ కోవిడ్-19కు సంబంధించి ఎటువంటి వార్త బయటకు రాలేదు. 


ఇక ఆసియాలో నార్త్ కొరియా, యెమెన్, తుర్కెమిస్థాన్, తజికిస్థాన్‌‌లలో కరోనా లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదు. చైనాకి అత్యంత సమీపంలో ఉన్న నార్త్ కొరియాలో కరోనా వైరస్ లక్షణాలు ఒక్కటి కూడా లేవని ఆ దేశానికి చెందిన కొందరు నిపుణులు చెబుతున్నారు. 


ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. అమెరికాలో 2లక్షల మందికి ఈ వైరస్ సోకగా.. 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాతి స్థానాల్లో స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి. భారతదేశంలో 3వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వంద మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com