ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడిలైడ్ టెస్టులో గెలుపు దిశగా ఆస్ట్రేలియా..

international |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 06:48 PM

 పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 39-3 వద్ద నిలిచింది. కెప్టెన్ అజహర్ అలీ(9) సహా ఇమాముల్ హక్(0), బాబర్ ఆజమ్(8) పెవిలియన్ బాట పట్టారు. క్రీజులో షాన్ మసూద్(14 నాటౌట్), అసద్ షఫిక్(8) ఉన్నారు. మిచెల్ స్టార్క్ 1 వికెట్, హెజెల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా, పాక్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును చేరుకోవడానికి ఇంకా 248 పరుగులు చేయాల్సి ఉంది. 91-6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 94.4 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో పాక్‌ను గడగడలాడించగా.. కమిన్స్ 3 వికెట్లు, హెజెల్‌వుడ్ 1 వికెట్ తీసుకున్నారు. తదనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం క్రీజులో నిలబడలేకపోయారు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. కాగా, ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వార్నర్ రికార్డు ట్రిపుల్ సెంచరీ(335 నాటౌట్)తో చెలరేగడంతో పాక్ ముందు భారీ స్కోరు (589/3) ఉంచింది. డే/నైట్ టెస్టులో ఇది వరకు వార్నర్ స్కోరే అత్యధికం. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో రెండో అత్యధిక స్కోరు(335) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ నిలిచాడు. హెడెన్ 380 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com