ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ పగ్గాలు ప్రియాంకకు ?

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 02:45 PM

సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాహుల్ గాంధీ రాజకీయ వైరాగ్యంతో ధ్యానం పేరుతో దేశాలు తిరుగుతున్నారు. దేశంలో ఏం జరుగుతున్నా ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కూమొక్కూ లేకుండా సాగుతోంది. ఈ పరిస్థితి ఆ పార్టీ సీనియర్లను, కాంగ్రెస్ కుటుంబ వీర విధేయులను తీవ్రంగా వేధిస్తోంది.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ, మోదీ చెబుతున్న కాంగ్రెస్ ముక్త భారత్ అనేది త్వరలోనే జరిగిపోతుందని భయపడుతున్నారు. అది కూడా బీజేపీ ఏమీ చేయకుండానే కాంగ్రెస్ తన చావు చస్తుందని ఆందోళన చెందుతున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీలోని కొందరు పెద్దలు కొద్దిరోజులుగా తీవ్ర మేథోమథనం జరుపుతున్నారు. సోనియా కుటుంబం నుంచే ఒక ఫేస్ ఉన్నప్పుడే పార్టీ బతుకుతుందని లేదంటే, పార్టీ మనుగడ కష్టమని ఆ మేథమథనాల్లో తేల్చి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారట.


కాడి పక్కన పడేసిన రాహుల్ గాంధీని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారట. అదేసమయంలో రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ అలియాస్ ప్రియాంకా వధేరా కూడా పార్టీలో యాక్టివేట్ అవుతుండడంతో ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో మరింత క్రియాశీల పాత్రను పోషించేందుకు సిద్దమవుతున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రియాంకే ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com