బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ చేసింది పొరపాటే తప్ప నేరం కాదు. షకిబ్‌ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అని బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ మహ్మదుల్లా రియాద్ పేర్కొన్నాడు. షకిబ్ పునరాగమనంలో అతడిని సాదరంగా జట్టులోకి స్వాగతిస్తామని మహ్మదుల్లా అన్నారు. షకిబ్‌తో బుకీలు సంప్రదింపులు జరిపినా.. ఆ విషయాన్ని ఐసీసీకి వెల్లడించకపోవడంతో షకిబ్‌పై రెండేళ్లు నిషేధం విధించింది. అయితే షకిబ్ తప్పు అంగీకరించడంతో ఏడాది మినహాయింపు లభించింది. తొలి టీ20 కోసం ఢిల్లీలో ఉన్న మహ్మదుల్లా రియాద్ తాజాగా మీడియాతో మాట్లాడారు. 'షకిబ్ చేసింది పొరపాటే తప్ప నేరం కాదు. మేం షకిబ్‌ను ప్రేమించాం. ఇప్పటికీ ప్రేమిస్తున్నాం. ఇంకా ప్రేమిస్తూనే ఉంటాం. నిషేధం అనంతరం జట్టులోకి పునరాగమనం చేయగానే సాదరంగా స్వాగతిస్తాం. డ్రస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించగానే మేమంతా గట్టిగా హత్తుకుంటాం' అని మహ్మదుల్లా తెలిపారు. 'ఇప్పుడు మా దృష్టంతా తొలి టీ20 మ్యాచ్‌పైనే ఉంది. విజయం సాదించటానికి కష్టపడుతాం. భారత్ లాంటి అగ్ర జట్టుతో విజయ అంటే చాలా శ్రమించాలి. బంగ్లా తరఫున నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. మా లోపాలేంటో ఎప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు మేం ధారాళంగా పరుగులు ఇస్తున్నాం. బ్యాటింగ్‌లో ఇంకా నిలకడ పెరగాలి. దీనిపై జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలు రచిస్తోంది' అని అన్నారు.