నిత్యం జరిగే జీవన పోరాటలకు తోడు కోర్టులలో వివిధ తగాదాలు, సివిల్, క్రిమినల్, తదితర కేసులెప్పుడు విచారణకు వస్తాయో. అసలు అక్కడేం జరుగుతోందో. తన కేసు పరిస్థితేంటో తెలియక ఇబ్బంది పడుతున్న కక్షిదారులకు ఊరట కలిగించేలా తమ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి భారత న్యాయ వ్యవస్థ ‘ఈకోర్ట్స్’ వెబ్‌సైట్‌ను, స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ‘ఈ కోర్ట్ సర్వీసెస్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వారి కేసుల వివరాలు నమోదు చేసి కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చు. హైకోర్టు, జిల్లా కోర్టు, తదితర కోర్టుల్లో ప్రతిరోజు ఎన్ని కేసులు వాదించారు, కక్షిదారుల వివరాలు, కేసు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ తెరిచిన తరువాత ఎడమవైపు పైనున్న మెనూ బార్‌పై క్లిక్ చేస్తే ఉపమెనూ తెరుచుకుంటుంది. దీనిలో configure ను క్లిక్ చేస్తే హైకోర్టు, జిల్లా కోర్టు, both ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో కావలసినది ఎంచుకొని ఓకే బటన్ నొక్కాలి. తెరపై సీఎన్ఆర్ (కేస్ నంబర్), కేస్ స్టాటస్, కేస్ లిస్ట్, మై కేసెస్ అనే నాలుగు ఆప్షన్లు కనిసిస్తాయి. కేస్ లిస్ట్‌లో రాష్ట్రం, జిల్లా ఎంచుకున్నక, సెలెక్ట్ కోర్టు కాంప్లెక్స్ అంశంలో కోర్టును, అనంతరం కోర్టు పేరును సెలెక్ట్ చేయాలి. తరువాత బాక్స్‌లో ఏ రోజు కేసు వివరాలు కావాలో ఆ తేదీని ఎంచుకుని, కింద ఇచ్చిన క్రిమినల్, సివిల్ కేసుల్లో ఏది అవసరమో సెలెక్ట్ చేస్తే... ఆ రోజు జరిగిన కేసుల పూర్తి వివరాలు కేస్ నెంబర్, పార్టీ పేరు, అడ్వకేట్ పేరుతో జాబితా తెరచుకుంటుంది. కేస్ నెంబర్‌పై ప్రెస్ చేయడం ద్వారా కేసు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలను మై కేసెస్ విభాగంలో నేరుగా చూసుకోవచ్చు. దీనిలో కేసు వివరాలు, ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ ఉంటాయి. ఒక పుస్తకం మాదిరిగా ఈ యాప్‌ను రూపొందించి న్యాయవాదులు, కక్షిదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. మెనూ బార్లో 17 వరకు అప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా సులభంగా కేసు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.