ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థితో శృంగారం చేసి జైలుకెళ్లిన టీచర్.. బెయిల్‌పై వచ్చి మరో విద్యార్థితో గర్భం

international |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 09:10 PM

ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా ఓ మహిళా టీచర్ పనిచేసింది. పాఠాలు చెప్పాల్సిన విద్యార్థులతోనే రాసలీలలకు దిగింది. అంతేకాకుండా ఈ ఘటనలోనే ఆమె జైలుకు కూడా వెళ్లింది. అయినా సరే బుద్ధి లేకుండా బెయిల్‌పై బయటికి వచ్చి మరో విద్యార్థితో ఎఫైర్ పెట్టుకుంది. అది కాస్తా గర్భం దాల్చే వరకు వెళ్లింది. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆ విద్యార్థుల వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. 30 ఏళ్ల ఆ టీచర్ ఇద్దరు విద్యార్థులతో సంబంధం పెట్టుకుని చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది.


బ్రిటన్‌కు చెందిన రెబక్కా జాయ్‌నెస్ అనే 30 ఏళ్ల మహిళా టీచర్ ఈ తతంగం మొత్తం నడిపింది. మొదట తాను పాఠాలు చెప్పే ఓ 15 ఏళ్ల బాలుడితో సంబంధం పెట్టుకుంది. 2021 లో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లి.. 345 పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.36 వేలు పెట్టి బెల్ట్ కొనిచ్చింది. ఆ తర్వాత అతడికి మాయమాటలు చెప్పి బాలుడితో శృంగారం చేసింది. ఈ విషయాన్ని ఆ బాలుడు తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేసి చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటను కూడా పంపాడు. ఈ విషయం బయటికి రావడంతో ఆమెపై కేసు నమోదైంది. బాలుడితో శృంగారం చేసిన ఘటనలో రెబక్కా జాయ్‌నెస్ జైలుకు కూడా వెళ్లింది.


ఇక ఆ కేసులో రెబక్కా జాయ్‌నెస్‌కు బెయిల్ లభించింది. దీంతో బుద్ధిగా ఉండకుండా మరో బాలుడిని లైన్‌లో పెట్టుకుంది. స్నాప్ చాట్‌లో పరిచయమైన మరో బాలుడికి తన ఫోటోలు పంపి రెచ్చగొట్టింది. ఎట్టకేలకుు ఆ బాలుడిని తన లైన్‌లోకి తెచ్చుకున్న రెబక్కా జాయ్‌నెస్ తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత వారిద్దరూ శృంగారం చేసుకోవడంతో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. దీంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది.


అయితే ఇద్దరు పిల్లలతో శృంగారం చేసిన ఘటనకు సంబంధించి 6 కేసులు రెబక్కా జాయ్‌నెస్‌పై నమోదయ్యాయి. కానీ తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని రెబక్కా జాయ్‌నెస్‌ మాంచెస్టర్ కోర్టుకు తెలిపింది. రెండో బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతనే తాను శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపింది. దీంతో మాంచెస్టర్ కోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను కొనసాగిస్తోంది. ఈ సంఘటనతో రెబక్కా జాయ్‌నెస్‌ను సదరు పాఠశాల సస్పెండ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com