భారీ వర్షాలకు.. రాష్ట్రంలోని రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. తిరుపతి నుంచి కడపకు బంగారు నగల లోడ్ తో వెళ్తున్న ఐషర్ లారీ బైక్ ని తప్పించబోయి తడిచిన రోడ్ పై స్కిడ్ అయి బోల్తా పడింది. చెన్నైలోని జీఆర్టీ గోల్డ్ షాప్ నుంచి లోడ్ తో ఈ లారీ మొదట తిరుపతికి వచ్చింది. అక్కడ బంగారు నగల్ని అన్ లోడ్ చేసి, కడపకు బయలుదేరింది. తిరుపతి-కరకంబాడి రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ తో పాటు సెక్యూరిటీగా వస్తున్న గన్ మ్యాన్ కి స్వల్ప గాయాలయ్యాయి.