ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం సూచనలతో పూర్తిస్థాయి డీజీపీగా నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 04:35 PM

ఆర్పీ ఠాకూర్ స్థానంలో రాష్ట్ర డీజీపీగా నియమితుడైన గౌతమ్ సవాంగ్ కు పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల అనంతరం ఆర్పీ ఠాకూర్ స్థానంలో వచ్చిన గౌతమ్ సవాంగ్ ఇప్పటివరకు ఇన్ చార్జ్ డీజీపీగానే కొనసాగారు.అయితే, పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో ఓ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ కమిటీ ముగ్గురి పేర్లతో తుది జాబితాను తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపగా, ఆ తుది జాబితాలో ఉన్న గౌతమ్ సవాంగ్ ను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్ కు చెందిన గౌతమ్ సవాంగ్ ఇప్పటివరకు పలు కీలక బాధ్యతల్లో సమర్థంగా పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com