కుబ్రత్ పులెవ్...బాక్సింగ్ ప్రపంచంలో మంచి పాపులారిటీ సంపాదించిన బల్గేరియా బాక్సర్. అయితే ఓ కొంటె పనితో చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడో ఫేమస్ బాక్సర్. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన బోగ్డాన్ డిన్తో తలబడి, విజయం సాధించాడు పులెవ్. ఈ కుస్తీలో పులెవ్... తలకు గాయమై నెత్తురు కారింది కూడా. అయినా చివరి దాకా హోరాహోరీ పోరాడి, విజయం సాధించాడు పులెన్. విజయానంతరం వెగస్ స్పోర్ట్స్ డైలీకి చెందిన మహిళా రిపోర్టర్ జెన్నీఫర్ రవాలో... కుబ్రత్ పులెవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఎంతో అసహనంతో సమాధానం చెప్పిన అతను... ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత వెళుతూ... రవాలోను గట్టిగా పట్టుకుని లిప్ లాక్ కిస్ పెట్టేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పులెవ్ చేసిన పనిని విమర్శిస్తూ, కామెంట్లతో విరుచుకుపడ్డారు నెటిజన్లు. పులెవ్ పురుషాహంకారంతో వ్యవహరించాడని కొందరు, ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో ఇదో కోణం అంటూ మరికొందరు పులవ్ చేసిన పనిని చీల్చిచెండాడేశారు.
In case you haven't watched it - this video of Bulgarian heavyweight boxer Kubrat Pulev kissing a female reporter after his win over Bogdan Dinu the other night has gone absolutely viral on social media pic.twitter.com/4VswieC6av
— mshumanov (@shumansko) March 25, 2019