ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చవకైన ధరలో 5జీ ఫోన్లు

Technology |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 11:04 AM

తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా టాప్ బ్రాండ్ అయి ఉండాలా? అయితే ఈ కథనం మీ కోసమే. మంచి ఫీచర్లు, అధిక పనితీరుతో కూడిన 5జీ హ్యాండ్ సెట్లను మీకు అందిస్తున్నాం.దీనిలో అధికంగా ప్రాసెసింగ్ పవర్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు ఉంటాయి. ప్రధాన కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటి ధర కూడా కేవలం రూ. 20వేలు లోపే ఉంటాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లతో పాటు 5జీ మొబైల్స్ దొరకడం అరుదు. అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్ స్పెక్ ఫీచర్లను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..


మోటోరోలా జీ84 5జీ..


రూ. 20వేల బడ్జెట్లో 5జీ ఫీచర్ ప్యాక్డ్ ఫోన్ ఇది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. 10-బిట్ కలర్ డెప్త్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఆటో-ఫోకస్‌తో 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కూడా పొందుతారు. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జర్ సపోర్టు ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 18,999గా ఉంది.


 


మోటోరోలా జీ54 5జీ..


 


ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. దీనిలో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జర్ సపోర్టు ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 15,999గా ఉంది.


 


శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ..


 


ఈ స్మార్ట్ ఫోన్లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రార వైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. శామ్‌సంగ్ వన్ యూఐ 5.1తో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 17,999గా ఉంది.


 


వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ..


 


ఈ ఫోన్ వెనుక వైపు 108 ఎంపీ కెమెరా ఉంటుంది. 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంటాయి. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జర్ అరగంట కంటే తక్కువ వ్యవధిలో 75 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 18,999గా ఉంది.


 


లావా అగ్ని 2 5జీ..


ఈ స్మార్ట్ ఫోన్లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుక 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌తో 16 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 19,999గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com