ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెక్సికో నైట్ క్లబ్‌లో కాల్పులకు తెగబడ్డ ఉన్మాదులు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:48 PM

మెక్సికో నైట్ క్లబ్‌లోకి ఆయుధాలతో చొరబడిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. జకాటె‌కాస్ రాష్ట్రంలోని జెరెజ్ నగరంలోని ఎల్ వెనాడిటో నైట్ క్లబ్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జెరేజ్ నగరంలోని ఓ బార్‌లోకి భారీగా ఆయుధాలతో చొరబడిన ఆగంతకుడు.. విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. దీంతో ఘటనా స్థలిలోనే తీవ్ర గాయాలతో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.


మృతుల్లో క్లబ్‌లో ఉద్యోగులు, కస్టమర్లు, మ్యుజీషియన్లు ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొన్నారు. దుండగుడు కాల్పులతో క్లబ్‌లో హాహాకారాలు మిన్నంటాయి. ప్రాణభయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తారు. క్లబ్ అంతా రక్త మడుగులా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గత కొన్నేళ్లుగా జెరెజ్ నగరం హింసకు నిలయంగా మారిపోయింది. హింసకు భయపడి గతేడాది వందలాది మంది స్థానికులు తమ నివాసాలను వదలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు.


అమెరికాకు డ్రగ్స్ అక్రమ రవాణకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న జకాటెకాస్‌లో డ్రగ్స్ ముఠాల మధ్య నిరంతరం ఆధిపత్యపోరు జరుగుతుంది. ముఖ్యంగా జెలెస్కో న్యూ జనరేషన్, సినోలా ముఠాల మధ్య కాల్పులతో దద్దరిల్లుతోంది. మెక్సికోలో ప్రభుత్వం డ్రగ్స్‌ నిరోధక ఆపరేషన్లు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలు డ్రగ్స్‌ మాఫియా గ్రూపుల కాల్పులకు తెగబడుతున్నాయి. రాజకీయ నేతలు, పోలీసులు, సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com