ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. అయితే కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ కాగా, మిగతా వారికి సగం కంటే తక్కువ, ఇంకొంత మందికి అసలుకే రాక బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే జాబితాలో రైతుల పేర్లు ఉన్నప్పటికీ ఖాతాలో మాత్రం డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.