అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య మాటలయుద్ధం నడిచింది. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా.. నల్గొండలో జగదీశ్ రెడ్డిపై క్రిమినల్ రికార్డ్ ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ రికార్డ్ చూపిస్తే ముక్కు నేలకు రాసి MLA పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.