భిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయంలో గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బుధవారం అలంకరించిన ఎడ్లబండ్లను అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదీక్షించడం జరిగిందన్నారు. గురువారం ఉదయం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించడం జరిగిందని శుక్రవారం ఉదయం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని తెలిపారు.