ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 06:13 PM

టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్‌ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ RFCలో జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

కావ్య థాపర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com