ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 09:26 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగింది. రీసెంట్గానే ప్రోమో విడుదల చెయ్యగా, దానికి ప్రేక్షకాభిమానుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడంతా పవర్ స్టార్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహా సంస్థ పవన్ అభిమానులను సంతోషంతో ముంచెత్తే ఒక సరికొత్త ప్రకటన చేసింది.


గతంలో చేసిన ప్రకటన ప్రకారం, ఫిబ్రవరి మూడవ తేదీన ఆహా లో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ప్రీమియర్ కావాల్సి ఉండగా, అభిమానుల కోసం మూడు గంటలు ముందుగానే అంటే ఫిబ్రవరి 2 వతేది రాత్రి తొమ్మిది గంటలకు ఆహా లో పవన్ కళ్యాణ్ సందడి మొదలుకాబోతుందని ఎనౌన్స్ చేసి, ఫ్యాన్స్ లో ఎక్జయిట్మెంట్ లెవెల్స్ ను మరింత పెంచేసింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com