కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ శుభవార్త అందించాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'రాజా రాణి' సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలతో భారీ విజయం సాధించాడు. అయితే నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ప్రియా తనకు మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.దీంతో అభిమానులంతా అట్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.