కొన్ని కాంబినేషన్లు సినిమా ప్రకటించినాటి నుండే రికార్డులను సృష్టించడం ప్రారంభిస్తాయి. అందులో తలపతి విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ ఒకటి. తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో తలపతి విజయ్ కి వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించారు. తాజాగా ఇప్పుడు తలపతి 68 ఈ కాంబినేషన్ లో రానుండగా ఈ సినిమాని టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అట్లీ షారుఖ్ ఖాన్‌తో జవాన్‌ను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.