ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాఫిట్ జోన్‌లో నాని 'దసరా'?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 09:10 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 30 మార్చి 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.  

తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించినట్లు లేటెస్ట్ బజ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి విడుదలకు ముందే 12 కోట్లు లాభం వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 65 కోట్ల కాగా థియేట్రికల్ మరియు డిజిటల్ రైట్స్ 29 కోట్లు మరియు 48 కోట్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం  అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com