ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజయ్ దేవగణ్ "భోళా" నుండి టబు ఫస్ట్ లుక్ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 02:09 PM

బ్లాక్ బస్టర్ "ఖైదీ" హిందీలో "భోళా" పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ, ఇందులో హీరోగా కూడా నటిస్తున్నారు. అలానే నిర్మిస్తున్నారు కూడానూ.


రీసెంట్గా ఈ సినిమా నుండి అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా దానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.


మరొక హీరోయిన్ అమలా పాల్ ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలో నటిస్తుంది. అజయ్ దేవగణ్ ఫిలిమ్స్, డ్రీం వారియర్ పిక్చర్స్, టి సిరీస్ , రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 30, 2023లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com