ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతోష్ శోభన్ "లైక్ షేర్ సబ్స్క్రైబ్" ఓటిటి ఎంట్రీ డేట్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 01:01 PM

యంగ్ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన "లైక్ షేర్ సబ్స్క్రైబ్" మూవీ డిసెంబర్ 9వ తేదీ నుండి డిజిటల్ లో సందడి చెయ్యబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 9 నుండి ప్రముఖ ఓటిటి సోనీ లివ్ లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.


మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ట్రావెల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ధియేటర్ ఆడియన్స్ ను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. మరి, డిజిటల్ లో సంతోష్ శోభన్ ట్రావెల్ వ్లాగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com