ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హిట్ 2" డిజిటల్ పార్టనర్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 12:42 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 మూవీ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు నుండీ ఆడియన్స్ లో ఈ సినిమా పట్ల సూపర్ పాజిటివ్ వైబ్స్ ఉండగా, విడుదల తరవాత తొలి షోతోనే హిట్ టాక్ అందుకుంది ఈ సినిమా. దీంతో హిట్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బిగ్ నంబర్స్ ను నమోదు చేస్తుందో చూడాలి.


తాజా సమాచారం ప్రకారం, హిట్2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. హిట్ ది ఫస్ట్ కేసు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థే హిట్ ది సెకండ్ కేస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసింది.
 
శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com