సరికొత్త అవుట్ ఫిట్లో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన హీరోయిన్. ఆమె నటించిన మురారి, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఇష్టంగా చూస్తారు. ఇక క్యాన్సర్ బారినపడి కోలుకున్న సోనాలీ... మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆమె నటించిన 'ది బ్రోకెన్ న్యూస్' అనే వెబ్ సిరీస్లో ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రోజుకో అవుట్ ఫిట్ లో దర్శన మిస్తోంది.. ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో అందంగా కనిపించింది. ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం సోనాలీ పేరు వినిపించింది. అయితే ఈ ప్రచారాన్ని సోనాలి కొట్టిపారే సింది. తారక్ సినిమా కోసం తనని ఎవరు సంప్రదించలే దని క్లారిటీ ఇచ్చింది