ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివ కార్తికేయన్ తదుపరి సినిమాకి టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 01:49 PM

తమిళ హీరో శివకార్తికేయన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు మూవీ తీస్తున్నారు అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన జోడిగా ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా కనిపిస్తుందని మేకర్స్ ప్రకటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకి 'ప్రిన్స్' అని టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోర్ పరమహంస కెమెరా క్రాంక్ చేయనున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com