టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు బాలయ్య పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్‌తో పాటు ఈ సినిమా అధికారికంగా ప్రకటించనున్నారు అని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి 'బ్రో ఐ డోంట్ కేర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.