కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ 'ఎన్టీఆర్ 30' మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ కి తారక్ అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అనిరుధ్ ఇప్పటికే 'ఎన్టీఆర్ 30' ఆల్బమ్ కోసం పని చేయడం ప్రారంభించాడని మరియు త్వరలో కొన్ని ట్యూన్లను లాక్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ తారక్ అభిమానులు ఎన్టీఆర్ 30 ఆల్బమ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. 150 కోట్ల బడ్జెట్‌తో ఎన్టీఆర్ 30 సినిమాని తీస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.