ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తొలి తెలుగు చిత్రానికి స్వయంగా డబ్బింగ్ చెప్తున్నా నజ్రియా ఫహద్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:36 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం "అంటే సుందరానికి" అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ ఈ సినిమాలో తన పాత్ర లీలా కోసం తానే స్వయముగా డబ్బింగ్ అందిస్తున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ ఒక చిన్న వీడియో క్లిప్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 10, 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com