ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆ దర్శకుడి" కన్నీరును తుడిచిన పవన కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:36 PM

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదివరకెన్నడూ లేని విధంగా వరస ప్రాజెక్టులను ఎనౌన్స్ చేస్తున్నారు, అలానే వాటి కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు. పాలిటిక్స్ లో బిజీ అవ్వకముందే తన కమిట్మెంట్స్ అన్నిటికి కార్యరూపాన్ని ఇచ్చి విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో క్రిష్ డైరెక్షన్లో, హిస్టారికల్ మూవీ గా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు కై పవన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతుంది. ఈ షెడ్యూల్ తో హరిహరవీరమల్లు షూటింగ్ అంతిమదశకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా అలా పూర్తవుతుందో లేదో పవన్ వెంటనే వినోదయ సిత్తం రీమేక్ తో బిజీ అవుతారు. సముద్రఖని డైరెక్షన్లో, సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్ లో నటించబోతున్న ఈ చిత్రంలో పవన్ ఆధునిక దేవుడి అవతారంలో చాలా కొత్తగా కనిపించబోతున్నారట. ఈ సినిమా కోసం 40రోజుల ఏకధాటి కాల్షీట్లను కేటాయించిన పవన్ ఆ వెంటనే డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేస్తారని అందరు అనుకుంటున్నారు. 


హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఈ కాంబోపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. గబ్బర్ సింగ్ లాంటి మ్యాజికల్ హిట్ కోసం పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎనౌన్స్ అయ్యి చాలా కాలమే గడిచింది. షూటింగ్ కోసం అన్ని సిద్ధం చేసుకున్న హరీష్ పవన్ పిలుపుకై పడిగాపులు కాస్తున్నాడు. అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తున్నా  ఈ సినిమా కార్యరూపం దాల్చదేమోనని కొంతంమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే పవన్ హరీష్ శంకర్ ను కలిసి భవదీయుడు భగత్ సింగ్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను, సెట్ వేసే పనులను కానివ్వమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సినిమాపై వస్తున్న పుకార్లని ఏమాత్రం లెక్క చెయ్యద్దని హరీష్ కు ఓదార్పు నిచ్చాడట. దీంతో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఆగస్టు నుండి పట్టాలెక్కేస్తుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com