ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెంటిమెంటుకే పెద్దపీట... 'అ' అక్షరంతోనే #SSMB 28 టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:33 PM

ఇటీవల సర్కారువారిపాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ యాటిట్యూడ్ కు, స్టైలిష్ యాక్టింగ్ కు, పంచ్ డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం SVP సక్సెస్  జోష్ లో ఉన్న మహేష్ కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో #SSMB 28 ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ టీజర్ రిలీజ్ చెయ్యటానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడట. 


సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని మే 31న #SSMB 28 మూవీ టీం టైటిల్ టీజర్ ను  రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ మూవీ టైటిల్ గా అర్జునుడు అనే పేరును లాక్ చేసినట్టు సమాచారం. ఇదే పేరుతో మే 31న టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారట. త్రివిక్రమ్ కు బాగా అచ్చొచ్చిన 'అ' అక్షరంతోనే ఈ మూవీ టైటిల్ ఉండటం విశేషం. అతడు, అల వైకుంఠపురంలో, అరవింద సమేత, అత్తారింటికి దారేది, అ ఆ సినిమాల తరహాలోనే మహేష్ 28వ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే, అర్జునుడు అనే టైటిల్ ను కేవలం త్రివిక్రమ్ కు సెంటిమెంటుగానే గాక మహేష్ కు అచ్చొచ్చిన 'అ' అక్షరం పేరు మీద కూడా వచ్చేటట్టు పెట్టారట. అతడు, ఒక్కడు, దూకుడు సినిమాలలో మహేష్ పోషించిన పాత్ర పేరు అజయ్. ఈ పేరుతో వచ్చిన ఆ సినిమాలు మహేష్ కు మంచి విజయాలనందించాయి. ఈ నేపథ్యంలో దర్శకుడికి, హీరోకు సెంటిమెంటుగా వస్తున్న అర్జునుడు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com