నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ తర్వాత, సున్నిత ప్రేమకధా చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ఖుషి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా రూపొందుతుంది. గత కొన్ని రోజులనుండి కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఖుషి మూవీ తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఖుషి మూవీ టైటిల్ పోస్టర్ కు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మహానటి చిత్రంలో కొద్దిసేపు ప్రేమపక్షుల్లా కనిపించి ఆడియన్స్ ను మురిపించిన విజయ్- సమంత లు ఈ చిత్రం లో పూర్తి నిడివిలో జంటగా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 23న ఖుషి చిత్రం విడుదల కానుంది.