ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయమ్మ షూటింగ్ లో తృటిలో పెనుప్రమాదాన్ని తప్పించుకున్న సుమ...!

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 01:34 PM

ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల చాలా కాలం తర్వాత వెండితెరపై సందడి చెయ్యటం మొదలుపెట్టారు. ఆమె ప్రధానపాత్రలో, విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన విలేజ్ కామెడీ డ్రామా జయమ్మ పంచాయితీ నిన్ననే విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ వీకెండ్ గడిస్తే గాని సుమ వెండితెర రీఎంట్రీ ప్రయత్నం సఫలం అయ్యిందా?లేదా? అన్నది తెలుస్తుంది. 


పోతే..., ఈ మూవీ షూటింగ్ సమయంలో సుమ అనుకోని ప్రమాదం నుండి అదృష్టవశాత్తు తప్పించుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చున్న సుమ అనుకోకుండా కాలు జారి కింద పడింది. కొంచెముంటే సుమ ఆ ప్రవాహం లో కొట్టుకుపోయేది. అయితే, ఈ ప్రమాదంలో సుమకు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com