సినిమా డెస్క్: దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న రోగ్ చిత్రానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యాడు. యంగ్ హీరో ఇషాన్‌ను ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.తాజాగా నటుడు సల్మాన్‌ఖాన్, పూరి జగన్నాథ్ రోగ్ సినిమాపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అయితే పూరీ చెప్పిన విధానానికి ఫిదా అయిన సల్మాన్.. ముక్కుమీద కోపం వుండే యువకుడు... పరిస్థితుల కారణంగా ఎలా మారాడనేది చాలా కొత్తగా ఉందని, సల్మాన్ తనను మెచ్చుకున్నాడని డైరెక్టర్ చెప్పాడు. సల్మాన్‌కి చెప్పిన తన సబ్జెక్ట్స్‌లో త్వరలో ఒకటి ఫైనల్ అవుతుందని, కొత్త సబ్జెక్టు, కొత్త ఐడియాలు ఆహ్వానిస్తాడని పూరీ చెబుతున్నాడు.