టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ కు ఒక వ్యక్తి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. హసీన్ జహాన్ తన భర్తకు దూరంగా.. తన కూతురుతో కలిసి వేరుగా ఉంటున్నారు. కోల్ కతాకు చెందిన ఓ 25 ఏళ్ల వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ లు చేస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేయడంతో.. ఆమె ఆ యువకుడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని దుండగుడు బెదిరిస్తున్నాడని, ఫోన్ చేసి తిట్టేవాడని, ఆ వేధింపులను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.