హెల్మెట్ ధరించకపోవడం లేదా సిగ్నల్ దాటటం... ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్న విషయం విదితమే. ఇటువంటి ఉదంతాల్లో నంబరుప్లేటు ఆధారంగా సంబంధిత వాహనదారులకు ఈ- మెమోలు పంపిస్తుంటారు. అయితే కొంతమంది వాహనదారులు ఇటువంటి మెమోల నుంచి తప్పించుకునేందుకు నంబరు ప్లేట్లను కూడా మారుస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది వాహదారులు తమ వాహనానికి ఉన్న నంబరు ప్లేట్లను పక్కకి వంచుతుండగా, మరికొందరు దానిపై గుడ్డను కప్పడం, లేదా రుమాలు వేయడం మొదలైన పనులు చేస్తున్నారు. తద్వారా వారి వాహనం నంబరు కెమెరాకు పూర్తిగా చిక్కదు. తద్వారా వారికి ఈ మెమో అందేందుకు అవకాశం ఉండదు. కాగా ఈ కఠిన నియమాల అమలుకు ముందు వాహనదారులు తమ పత్రాలను అప్డేట్ చేయించుకునేందుకు ఆర్టీఓ దగ్గరకు వచ్చేవారు. పెద్దపెద్ద లైన్లలో నిలుచుని తమ వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేసుకునేవారు. దీంతో వారు వాహనాన్ని నడిపేటప్పుడు వారి వాహనానికి ఉన్న నంబరు ప్లేటు వివరాలు రోడ్లపై ఉండే కెమెరాలకు చిక్కేవి. తద్వారా వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినపుడు వారికి ఈ మెమోలు వెళ్లేవి.