ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తే అమ్మై అత్తారింటికి పంపింది

national |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2019, 12:52 PM

అత్తే ఆ అమ్మాయికు అమ్మ అయింది. ఈ రోజుల్లో అత్తకి, కోడలికి అంతగా పడదు అంటుంటారు. కానీ ఆ కోడలి జీవితం అత్తే తీర్చిదిద్దింది. ఒడిశాలోని అనుగుల్ జిల్లా గోబర గ్రామం అది. అక్కడే పనిచేస్తున్నారు తల్లి, కొడుకు. ఫిబ్రవరిలో కొడుకుకి తురంగో గ్రామానికి చెందిన లిల్లీతో పెళ్లి చేసింది ప్రతిమ బెహరా. కోడలు వచ్చేకే ఇంటికి కొత్త వెలుగు వచ్చింది. అత్తలా కాదు తల్లిలా చూసుకునేది కోడలు. అత్త కూడా కోడలిని కూతురిలా చూసుకునేది. ఇలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాల్లో ఓ పెద్ద కుదుపు.


బొగ్గుగనిలో పనిచేస్తున్న కొడుకు ప్రమాదంలో మరణించాడు. అంతే ఒక్క సారిగా వారి జీవితాల్లో మార్పు. ఆ అత్త తనకంటే కోడలి గురించే ఎక్కువ ఆలోచించేది. కోడలు జీవితం అంధకారంలోకి వెళ్తుందనే భాద ఆమెను కుంగతీసింది. చిరునవ్వుతో సందడి చేసే ఇల్లాలి మొఖం, భర్త మరణంతో కళ తప్పేసరికి ఆ అత్త తట్టుకోలేకపోయింది. అందుకే నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఊహించి భయపడింది. అందుకే మళ్ళీ ఆ అమ్మాయికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంది. కొత్త జీవితం అందించుకోవాలని అనుకుంది. ఆ అమ్మయి అస్సలు ఒప్పుకోలేదు. అయిదు నెలలు కాక ముందే ఏంటిది అని బంధువులు అందరు తిట్టారు. కానీ ఆమె తగ్గలేదు, పట్టించుకోలేదు. ఏది ఏమైనా తన కోడలి జీవితం బాగుండాలని కోరుకుంది. ఆ అమ్మయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడింది. వాళ్ళు కూడా ఎదురుచెప్పలేదు. వెంటనే మంచి అబ్బాయిని చూసి ఘనంగా వివాహం చేసింది. కొత్త జీవితం ప్రసాదించింది. ఆమెకు ఇద్దరు కొడుకులు. అమ్మాయిలు లేరు. కానీ నా కూతరు ఈ అమ్మాయే అని ఎప్పుడు చెబుతుంటుంది. పుట్టింటిగా లిల్లి కూడా తనకు మళ్ళీ జీవితం ఇచ్చిన ఆ అమ్మ పేరే చెబుతుంది. పుట్టింటికి వెళ్ళాలి అన్నా ఆ ఇంటికే వెళ్తుంది. పెళ్లిని ముందు చాల మంది విమర్శించినా తరువాత అందరు ఆ అమ్మాయికీ మంచి జీవితం అందించని ఆ ఊరంతా మెచ్చుకున్నారు. ఆ ఊరు మొత్తం ఆదర్శంగా నిలిచారు ఈ అత్త, కోడలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com