ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ రెండు రోజుల్లో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2017, 01:25 AM

(వెలగపూడి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి):సినీగ్లామర్‌ ఉన్న నేతలు రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో పోటీచేస్తే అనంతపురం జిల్లా ప్రజలకు వారికి బ్రహ్మరథం పట్టడం అనేది ఒక పరంపర కొనసాగుతోంది. ఈ ప్రస్తావన ఇప్పుడెందుకూ అంటే- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనంతపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించడమే. అంతేకాదు- ఇక్కడే పార్టీ కార్యాలయం, సంస్థాగత నిర్మాణాలు చేపడతానని ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో నెలకొన్న సంబరం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షపార్టీ అప్రమత్తమయ్యాయి. అనంతపురం జిల్లాలో కరువు అంశాన్ని అజెండాగా తీసుకుని పవన్‌ కల్యాణ్‌ పాదయ్త్రా చేపట్టడానికి సిద్ధపడుతున్నారట. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను రెండు మూడు రోజుల్లో ఖరారుచేస్తామని జిల్లా జనసేన నేతలు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాపై దష్టి సారిస్తే అనంతపురం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఉన్న బలిజ సామాజికవర్గ ఓట్లర్లపై ఆ ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ తరుణంలో భవిష్యత్తులో ఎన్నికల పొత్తులు కుదిరితే అయిదు లేదా ఆరు స్థానాలను ఈ జిల్లాలో పవన్‌ కోరే అవకాశముందట. 2019 ఎన్నికలను దష్టిలో పెట్టుకుని, పాదయ్త్రా చేయడం ద్వారా ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం! అనంతపురం జిల్లా ప్రజలు సినీగ్లామర్‌ ఉన్న నేతలకు జైకొట్టడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును హిందూపురం నుంచి ఎన్నుకొని ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత హరికష్ణకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బాలక ష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తమ సమస్యలను పరిష్కారించడానికి సినీగ్లామర్‌ ఉన్న నేతలు తోడ్పడతారన్న ఆశ జిల్లా ప్రజలకు బలంగా ఉంది. ఇదే తరహాలో ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌పై కూడా ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయవర్గాల విశ్లేషణ. జనసేన అధినేత పవన్‌ ఇదివరకే అనంతపురంలో, గుత్తిలో పర్యటించారు. విద్యార్థులతో ముఖాముఖీ వంటివి కూడా నిర్వహించారు. జిల్లాకు పవన్‌కల్యాణ్‌ వచ్చినప్పుడు ఆయన వెంట కాపు సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారట. ఆ తర్వాత స్థానంలో రెడ్డి సామాజికవర్గం వారు ఉన్నారట. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలకు కూడా ఆయన తగు ప్రాధాన్యం ఇస్తే ఆయా వర్గాల ప్రజానీకంలో కూడా పట్టు పెంచుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉంటారు కనుక వారి అంచనాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఎన్‌టీఆర్‌ అలా పనిచేయబట్టే ఇప్పటికే హిందూపురం ప్రజలు ఆ కుటుంబానికి పట్టంకడుతూ వస్తున్న సంగతిని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com