ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ శాఖల్లోని లోపాలు అవకతవకలను విడుదల చేసిన కాగ్‌ నివేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2017, 12:43 AM

అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వశాఖల్లోని లోపాలు, అవకతవకలను తాజాగా విడుదలైన కాగ్‌ నివేదిక బట్టబయలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధి నిర్వహణలో పాల్పడుతున్న అక్రమాలను ఎండగట్టింది. రెవెన్యూ, సామాజిక రంగాలు, స్థానిక సంస్థలు, ప్రజాపన్నులు, మున్సిపాలిటీ, పరిశ్రమలు సహా ఆయా ప్రభుత్వ విభాగాల్లోని లోపాలను గుర్తించి మొట్టికాయలు వేసింది. తాజాగా 2016 మార్చి 31తో ముగిసిన ఏడాదికి సంబంధించిన భారత కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ నివేదిక శుక్రవారం విడుదలైంది. ఈ నివేదికలో కష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు విభాగాల్లో లోపాలు వెలుగుచూశాయి. రవాణాశాఖలోని రెవెన్యూ బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ గుంటూరు, విజయవాడ కార్యాలయాల తీరును కాగ్‌ నివేదిక తప్పు పట్టింది. మోటారు వాహన చట్టం ప్రకారం ఏటా రెన్యువల్‌ చేయాల్సిన వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలలో పలు అవకతవకలను సైతం వెల్లడించింది. రాష్ర్టంలో గుంటూరు సహా 11 డీటీసీ, గుడివాడ సహా ఎనిమిది ఆర్‌టీవో కార్యాలయాలలో ఈ ప్రక్రియ సరిగా జరగడం లేదని తెలిపింది. దీనికితోడు కాంపౌండింగ్‌ ఫీజును సైతం సరిగా వసూలు చేయలేదంటూ విజయవాడ డీటీసీ కార్యాలయాన్ని హెచ్చరించింది. త్రైమాసిక పన్నులు, జరిమానా వసూలులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తెలిపింది. ఏడేళ్లు దాటిన రవాణా వాహనాలు, 15 ఏళ్లు దాటిన రవాణేతర వాహనాలకు సంబంధించి కట్టించుకోవాల్సిన హరితపన్ను విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ గుంటూరు, విజయవాడ డీటీసీ కార్యాలయాల తీరును నివేదిక వెల్లడించింది. ఆస్తికి సంబంధించిన విలువలను తక్కువగా లెక్కించి రిజిస్ట్రేషన్లు చేయడంతో రుసుంగా తక్కువ వసూలు చేశారంటూ గుణదల డీఆర్‌, కంకిపాడు ఎస్‌ఆర్‌ కార్యాలయంతో సహా మరికొన్నింటి తీరును నివేదిక ఎండగట్టింది. వ్యవసాయేతర అవసరాల కోసం వ్యవసాయ భూమిని మార్పిడి చేసే సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషను ఫీజును తక్కువగా విధించారంటూ 30 ఎస్‌ఆర్‌ కార్యాలయాలకు మొట్టికాయలు వేయగా.. వాటిలో మంగళగిరి, నూజివీడు, తెనాలి(పశ్చిమం), అమరావతి ఉన్నాయి. గ్రామస్థాయి భూమి రికార్డులను సరిగా నిర్వహించడం లేదంటూ రాష్ర్టంలో పది మండలాలను గుర్తించగా వాటిలో గుంటూరు, పెనమలూరు, విజయవాడ(పట్టణ) మండల కార్యాలయాలు ఉన్నాయి. గ్రామస్థాయి, మండల స్థాయి భూ రికార్డుల మధ్య వ్యత్యాసం ఉందంటూ పెడన, పెనమలూరు, విజయవాడ(పట్టణ) తహసీల్దార్లకు సూచించారు. ఈ దోషాలను సరిచేసినట్టుగా ముగ్గురు తహసీల్దార్లు దీనిపై సమాధానం సైతం ఇచ్చారు.  తెనాలి, గుంటూరులోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాల తీరు కాగ్‌ నివేదికతో వెలుగుచూసింది. అసలే ప్రభుత్వాసుప్త్రుల్లో అరకొర వసతులతో ఇబ్బంది పడుతుంటే అక్షరాలా రూ.3.10 కోట్లతో కొనుగోలు చేసిన 77 వైద్య పరికరాలను నిర్లక్ష్యంగా ఈ రెండు ఆసుప్త్రుల్లో వదిలేశారంటూ వెల్లడించింది. 2015-16 మధ్యకాలంలో కొనుగోలు చేసిన ఈ పరికరాలు నిరుపయోగంగా ఆసుపత్రిలో పడి ఉన్నాయి. ఈ పరికరాల కోసం నిర్మిస్తున్న నూతన భవనం పూర్తి కానందున అవి ఎక్కడపడితే అక్కడ స్టోర్‌ రూముల్లో పడేసి ఉంచేశారు. ఈ విషయాన్ని చిత్రాల సహా కాగ్‌ నివేదికలో బహిర్గత పరిచింది. అధికారుల తీరును ఎండగట్టింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ రూ.29.93 లక్షల విలువైన ఆటోఎనలైజర్‌ను నిరుపయోగంగా వదిలేశారు. ఆసుపత్రిలోని బయోకెమిస్ట్రీ విభాగానికి అవసరమైన ఈ పరికరాన్ని 2016 ఏప్రిల్‌లో కొనుగోలు చేసి ఇచ్చారు. ఇంతవరకూ దీనిని వినియోగంలోనికి తీసుకురాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే పరికరాన్ని ఉంచేందుకు అవసరమైన ఏసీ గది లేదంటూ చెప్పడం హాస్యాస్పదం. ఇదే విషయాన్ని కాగ్‌ తెలిపింది.్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో పన్నుల వసూళ్లలో జరిగిన అవకతవకలూ బయటకొచ్చాయి. ప్రధానంగా గుడివాడ, నందిగామ సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో సీటీవోల విషయం వెల్లడించింది. పరిమితి పద్ధతి తప్పుగా పాటించి ఇన్‌పుట్‌ పన్ను జమ అధికంగా క్లైయిం చేయడం, కొనుగోలు టర్నోవరు తప్పుగా నిర్ధరించడం, ఇన్‌పుట్‌ పన్ను జమ అధికంగా అనుమతించడం వంటివి చేశారంటూ తెలిపింది. ్ర వాణిజ్యపన్నుల శాఖలో ఆలస్యంగా చెల్లించిన పన్ను విషయంలో వడ్డీ, అపరాధరుసుం విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారంటూ గుంటూరు 1 డీసీ కార్యాలయం, ఆటోనగర్‌, బ్రాడీపేట, గుడివాడ, కాన్వెంటు వీధి, నందిగామ, మాచర్ల, నరసరావుపేట, పట్నంబజారు, సీతారామపురం, ఉయ్యూరు సీటీవోల తీరును నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో వ్యాట్‌ తనిఖీ చేసినప్పుడు పలు కేసుల్లో వ్యాపారులు చేసిన అమ్మకాలు, వ్యాట్‌ రిటర్నుల్లో తేడాలనూ బెంజిసర్కిల్‌, చీరాల, సీతారామపురం సీటీవోల పరిధిలో గుర్తించారు. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాష్ర్ట ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్ల కింద ఇచ్చిన నిధులను వినియోగించకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాయి. నాలుగు జిల్లాలు ఈ జాబితాలో ఉండగా కష్ణాజిల్లా ఒకటి కావడం గమనార్హం. ఆరు పంచాయతీరాజ్‌ సంస్థల్లో నగదు పుస్తకాలు సరిగా నిర్వహించడం లేదని గుర్తించగా వాటిలో కష్ణా జిల్లాలోనూ ఒకటి ఉంది. కష్ణాజిల్లాలోని ప్రభుత్వాసుప్త్రుల్లో వ ద్ధాప్య సంబంధ చికిత్సల కోసం వార్డులను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో నిధులు నిరుపయోగమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com